తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఏపీకి చెందిన వైకాపా నేతలు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగళవారం తిరుపతి విమానాశ్రయంకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వచ్చిన కేసిఆర్‌ను వెంటనే రాజంపేట వైకాపా ఎంపి మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కలిశారు. వారితో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు.
కేసీఆర్ ఇప్పటివరకు ఎవరికి అపాయింట్మెంట్ తిరుమలలో ఇవ్వకుండా వైకాపా నేతలను మాత్రమే కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తులతో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన ఆస్తులు కూడా తెలంగాణా రాష్ట్రాలలో ఉండడంతో కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. వారివారి ఆస్తులను కాపాడుకునేందుకే కేసీఆర్‌ను వైకాపా నేతలు కలిసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికై అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ తెలంగాణా ప్రాంతంలో ఉన్న తన ఆస్తులను కాపాడుకునేందుకు కేసిఆర్‌తో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేసిఆర్‌ను మచ్చిక చేసుకునేందుకు వైకాపా నేతలను తిరుమలకు పంపించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైకాపా నేతలు కేసిఆర్‌ను కలవడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది.