భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు: విజయసాయి రెడ్డి

శనివారం, 6 ఫిబ్రవరి 2021 (13:42 IST)
వైసీపీకి చెందిన కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత అవినీతి పరుడు అని తెహెల్క పత్రిక 16 ఏళ్ల క్రితమే బయటపెట్టింది అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు అంటూ చెప్పుకొచ్చారు. 
 
అయితే 20 కేసుల్లో స్టేలు తెచ్చుకొని కూడా తాను నిప్పు అంటూ బకాయిస్తాడు అంటూ విమర్శించారు. కనకమేడల లాంటి వందిమాగదులు మరిచిపోయినా ప్రజలు మరువరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడితో పాటు రాష్ట్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తీరుపై కూడా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ విడుద‌ల చేసిన మేనిఫెస్టోను ఎస్ఈసీ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 
'భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు! నేను కొట్టినట్లు నటిస్తా-నువ్వు  ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం. సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలిగానీ, టీడీపీ మేనిఫెస్టోను నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము!' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు