వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపడితే టీడీపీ - జనసేన కూటమికి అదనంగా మరో 20 సీట్లు...

వరుణ్

ఆదివారం, 14 జనవరి 2024 (16:38 IST)
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ - జనసేన పార్టీల సారథ్యంలోని కూటమి విజయం సాధించడం తథ్యమని, ఈ కూటమి ఏకంగా 135 స్థానాల వరకు గెలుచుకుంటుందని తెలిపారు. అదేసమయంలో ఏపీలో పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల పగ్గాలు చేపడితే టీడీపీ - జనసేన కూటమికి అదనంగా మరో 20 సీట్లు వస్తాయని ఆయన జోస్యంచెప్పారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల రాకతో అధికార వైకాపా ఓటు బ్యాంకు చీలిపోతుందని, అదే జరిగితే టీడీపీ - జనసేన పార్టీ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని తెలిపారు. 
 
సంక్రాంతి సంబరాల్లో భాగంగా, ఆయన ఆదివారం సొంత నియోజకవర్గమైన నరసాపురంకు వచ్చారు. నాలుగేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మరోమారు విమర్శలు గుప్పించారు. జగన్‌కు తీసుకోవడమే గానీ ఇవ్వడం తెలియదని చెప్పారు. తాను కూడా జగన్‌కు సాయం చేశాని, కాని తానెపుడూ జగన్ నుంచి సాయం పొందలేదని చెప్పారు. కష్టాల్లో ఉన్నపుడు సాయం చేసినవారే నిజమైన స్నేహితులని ఆయన గుర్తు చేశారు. 
 
"వైకాపా ప్రభుత్వంలోని ప్రజావ్యతిరేక నిర్ణయాలను తాను బహిరంగంగానే విమర్శలు చేశానని, అందుకే తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. అప్పటి నుంచి తన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా జగన్ అడ్డుకుంటూ వచ్చారన్నారు. అందుకే తాను రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తరూ ప్రజలకు చేరువయ్యాయని, ఈ విషయంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు