వల్లభనేని వంశీకి షాక్... ఎన్నిక చెల్లదంటూ...

బుధవారం, 10 జులై 2019 (13:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీ కేవలం 23 మంది సీట్లను మాత్రమే దక్కించుకుంది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీకి, టీడీపీ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. 
 
ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడుపై అనర్హత వేటు వేయాలని, వారి ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, వల్లభనేని వంశీకి కూడా షాక్ ఇచ్చారు వైసీపీ నేత వెంకటరావు. వల్లభనేని వంశీ ఎన్నిక చెల్లదంటూ ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిపై హైకోర్టులో విచారణ జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు