ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ ని వైసీపీ ఎంపీలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం రోజుకో కేంద్ర మంత్రిని కలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు.
దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ, హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం.
మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నారని వివరించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీనికి సానుకూలంగా స్పందించారని, మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించారని మహిళా ఎంపీ వంగా గీత మీడియాకు తెలిపారు.