ఎన్ని పిట్టల్ని కొట్టాడు.. సిన్ని నాయనా...

ఖండాంతరాలను దాటి పొట్ట నింపుకునేందుకు వచ్చిన వలస పక్షులను వల పన్ని పడుతున్నారు కొందరు వ్యక్తులు. మార్కెట్లకు తరలించి వలస పక్షుల కిలకిల రావాల గొంతుకలను నులిమివేస్తున్నారు.

కొల్లేరు పరిసర ప్రాంతాలకు ప్రతి ఏటా లక్షల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. వాటిని సంరంక్షించడానికంటూ ప్రభుత్వాలు వేలకు వేలు రూపాయలను కేటాయిస్తున్నాయి కానీ అవి వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.

అరుదైన పక్షి జాతులను తమ తూటాలకు బలి చేసి బహిరంగంగా మార్కెట్లలో విక్రయిస్తున్నా... అధికారులు పట్టనట్లు ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నాయకులు స్పందించి వలస పక్షులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు అర్థిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి