హైదరాబాద్ నగరానికి చెందిన 65 యేళ్ల ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) యాప్‌లో ఒక యువకుడితో చాటింగ్ చేశాడు. రెండు రోజుల తర్వాత అమీర్‌పేటలోని హోటల్ గదికి పిలిచాడు. గదిలో ఇద్దరు నగ్నంగా ఉన్న సమయంలో బయటి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెల్‌ఫోనులో న్లో వీడియో చిత్రీకరించారు. దాన్ని బయటపెడతామని బెదిరించి ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేశారు.
ఇందులో ఆ యువకుడు ముఠాలోని వ్యక్తే. కొద్దిరోజులకు వృద్ధుడికి ఫోన్ చేసిన ఆగంతకులు మరో రూ.20 వేలు ఇవ్వకుంటే ఆ వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామంటూ బెదిరించటంతో బాధితుడు పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇదే తరహాలో కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొందరిని హోటల్, నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి సొమ్ము వసూలు చేసినట్టు తేల్చారు.
పాలమూరుకు చెందిన ఇద్దరు, నల్లకుంటకు చెందిన ఒకరు ముఠాగా ఏర్పడ్డారు. ఎల్జీబీటీ యాప్ స్వలింగ సంపర్కు(గే)లుగా సభ్యత్వం తీసుకున్నారు. వీరితో చాటింగ్ చేసిన వారిని హోటల్ గదికి ఆహ్వానిస్తారు. ఒకరు గదిలో ఉంటే.. ఇద్దరు బయట ఉంటారు. గదిలోకి వెళ్లిన బాధితుడు నగ్నంగా మారగానే బయట ఉన్న ఇద్దరు మొబైల్ ఫోనులో వీడియోలు తీస్తూ లోపలకు వెళ్తారు. ఇద్దరినీ బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ముఠాలోని సభ్యుడు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేసినట్టు నకిలీ ఆధారాలు చూపుతాడు. ఇది నిజమని బాధితుడు తన వద్దనున్న డబ్బు ఇచ్చి తప్పించుకుంటాడు.
నగరానికి చెందిన వైద్యుడు. యాప్‌లో పరిచయమైన వ్యక్తి రమ్మనగానే ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. మద్యం మత్తులో ఉండగా వైద్యుడి నగ్న ఫొటోలు చిత్రీకరించారు. కొద్దిరోజులకు వాటిని అతడి వాట్సప్‌నకు పంపి రూ.2 లక్షలు కాజేసినట్టు సమాచారం. మోసపోయిన వారిలో కొందరు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. వీరిలో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు ఉంటున్నారని వివరించారు.