పురాతన బౌధ్ధ ఆలయం అమరావతి

మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (17:12 IST)
కృష్ణా నదీ తీరంలో ఉన్న అపురూపమైన ఆలయం అమరావతి. దీనినే పురాణాల్లో ధాన్యకటకా, ఆంధ్రానగరీ అని చెప్పబడింది. విజయవాడకు 66 కి.మీ దూరంలో ఉన్న అమరావతి పురాతన బౌధ్ధ స్థూపాలకు చిహ్నంగా చెప్పవచ్చు. దేశంలోని ముఖ్య బౌద్ధ స్థలాల్లో ఇది కూడా ఒకటి. తన శిల్ప కళతో పర్యాటక స్థలంగా ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.

రెండు, మూడవ శతాబ్దాలలో తొలి ఆంధ్రా రాజులు శాతవాహనులకు అమరావతి రాజధానిగా ఉండేది. స్థలమహత్యం, కృష్ణా నదీ తీరాన ఉండడం ఇక్కడి ఆసక్తికర అంశాలు. రాష్ట్రాన్ని పర్యటించే సమయంలో అమరావతి తప్పక చూడదగిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న అమరేశ్వరుని ఆలయంలో మహా శివుడు వివిధ పేర్లతో కొలువు దీరి ఉన్నాడు.

సుమారు 15 అడుగుల ఎత్తులో రాతి శివలింగం ఉంటుంది. ప్రాణేశ్వర, అగస్థేశ్వరా, కోసలేశ్వర, సోమేశ్వర, పార్థీవేశ్వర అనే పలు రకాల పేర్లతో ద్రావిడుల పద్ధతిలో ఇక్కడి ఆలయం నిర్మించబడి ఉంటుంది. కృష్ణా నది కొత్త మలుపు తీసుకునే ప్రదేశంలో ఈ అమరావతి ఉండడం మరో విశేషం.

పూర్వకాలంలో ఈ ఆలయం బౌద్ధుల పుణ్యస్థలంగా ఉండేదని స్థానికులు చెబుతుంటారు. మహాశివరాత్రి, మహా బహుళ దశమి రోజుల్లో ఇక్కడ జరిగే ఉత్సవాల వైభవం చెప్పలేనివి. ఇక్కడ మరో ఆకర్షణీయ అంశం మహాచైత్య. దేశంలోని అతి పెద్ద స్థూపం ఇక్కడే ఉంది. దీనిని రెండవ శతాబ్దంలో నిర్మించారు. ఆచార్య నాగార్జున ఈ స్థూపాన్ని నిర్మించడానికి కృషి చేశారని ఇతిహాసాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన వస్తువులు, విషయాలను ప్రదర్శించేలా ఇక్కడ ఓ మ్యూజియం కూడా ఉంది.

వెబ్దునియా పై చదవండి