01-11-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. మీ చుట్టూ విరోధులున్నారని?

శుక్రవారం, 1 నవంబరు 2019 (06:30 IST)
మేషం : పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వాయిదాపడటం వల్ల ఆందోళనకు గురవుతారు. ముఖ్యుల పట్ల అహంకారం వ్యక్తం చేయడం వల్ల అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు అధికం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
వృషభం : ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. దైవదీక్షలు పట్ల ఆసక్తి నెలకొంటుంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసికంగా కుదుటపడుతారు. 
 
మిథునం : ప్రైవేటు రంగాల్లో వారు విరోధులు తమ చుట్టూ ఉన్నారని గమనించండి. కీలకమైన వ్యవహారాల్లో ఆనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులెదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఉల్లాసంతో పనిలో దూసుకుపోతారు. గతంలో పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకుంటారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. 
 
కర్కాటకం : స్త్రీలు ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తూ సత్ఫలితాలు పొందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ధోరణి నిరుత్సాహపరుస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, హోటల్ తినుబండరాల వ్యాపారులకు పురోభివృద్ధి. పారిశ్రామిక రంగంలోనివారికి కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. 
 
సింహం : ఉద్యోగస్తులకు సెలవులు, పండుగ అడ్వాన్స్‌లు మంజూరవుతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఫైనాన్సు, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు సంతృప్తి కానరాగలదు. 
 
కన్య : మీ మేధస్సుకి, వాక్‌చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. అకాలభోజనం, శారీరకశ్రమ, మితిమీరిన ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురవుతారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు సామాన్యం. ఊహించని ఖర్చులెదురైనా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. 
 
తుల : నిరుద్యోగులకు వచ్చిన తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. కుటుంబీకులతో దైవ దర్శనాలలో పాల్గొంటారు. కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలు పని దృష్ట్యా ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్సులు, ఇతరాత్రా చెల్లింపులు జరుపుతారు. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. సోదరీ సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు : ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. విదేశీ ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువులను కలుసుకుంటారు. 
 
మకరం : దంపతుల మధ్య అవగాహన కుదరదు. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారిక ఒత్తిడి తప్పదు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. గృహ నిర్మాణ పథకాలలో సంతృప్తికానవస్తుంది. 
 
కుంభం : తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రగతి పథంలో నడిపించుకోండి. బంధుత్వాల విషయంలో చాలాగుడ్డిగా వ్యవహరిస్తారు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. 
 
మీనం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఏకాగ్రత వహించలేరు. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు