03-05-2021 సోమవారం దినఫలాలు - మల్లికార్జున స్వామిని పూజిస్తే...

సోమవారం, 3 మే 2021 (04:00 IST)
మేషం : సిమెంట్, ఇటుక, ఐరన్ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. గృహంలో మరమ్మతులకు అనుకూలం. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. 
 
వృషభం : హోటల్, తినుబండారాలు, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసివచ్చేకాలం. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం కావడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. అదరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
మిథునం : ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పుకు పరిక్షా సమయం అని గమనించండి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్థిరచరాస్తుల విషయంలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. నూతన వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. నిరుద్యోగుల నిర్లిప్త ధోరణి వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. క్రయ, విక్రయ రంగాల్లో వారికి స్పెక్యులేషన్ చేయువారికి అశాజనకం. 
 
సింహం : తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తగలవు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందడంతో ఉపశమనం పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. రాజకీయాల వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడుట వల్ల మాట పడక తప్పదు. కాంట్రాక్టర్లకు ఒకే సమయంలో అనేక పనులు చేపట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఫ్యాన్సీ, కిరాణా, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
తుల : భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. నూనె, మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి. పురోభివృద్ధి పొందుతారు. మీ వాహనం ఇతరులకివ్వడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి అభివృద్ధి కానవస్తుంది. 
 
వృశ్చికం : బంధు మిత్రుల నుంచి విమర్శలు, వ్యాఖ్యానాలు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేయువారికి మెళకువ అవసరం. మీ పెట్టుబడులకు మంచి స్పందన లభించడంతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
ధనస్సు : ఇతరులకు ధనసహాయం చేయడం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలలో దాగియున్న రచనా పటిమకు, కళాత్మతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పనం నెరవేరుతుంది. 
 
మకరం : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలు తప్పవు. వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అధికం. 
 
కుంభం : మందు వెనుకలుగానైనా మీరు చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తికాగలవు. హామీలకు దూరంగా ఉడటం క్షేమదాయకం. కంప్యూటర్, టెక్నికల్ రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
మీనం : మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. పెంపుడు జంతువులపై శ్రద్ధ చూపిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు