29-04-2021 గురువారం దినఫలాలు - కనకధారా స్తోత్రం పఠిస్తే...

గురువారం, 29 ఏప్రియల్ 2021 (04:00 IST)
మేషం : స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అధిక భాగం విందు వినోదాలలో కాలక్షేపం చేస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. 
 
వృషభం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. రాజకీయాల వారికి ఒత్తిడి, చికాకులుత తప్పవు. తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. 
 
మిథునం : పెద్ద మొత్తం డబ్బుతో దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. బంధు మిత్రులను కలుసుకుంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. 
 
కర్కాటకం : తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
సింహం : తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గృహంలో మార్పులు, చేర్పులకు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో మంచి గుర్తింపు లభిస్తుంది. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. మత్స్యు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. 
 
కన్య : స్థిరచరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. రాజకీయ రంగాల వారికి ప్రయాణాలు వాయిదాపడుట మంచిది. కుటుంబానికి కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. దూరదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
తుల : పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడంలో అడ్డుంకులు ఎదురవుతాయి. ఊహించని ఖర్చులు మీ అచంనాలను మించుతాయి. 
 
వృశ్చికం : ఉమ్మడి కుటుంబ విషయాలలో మాట పడాల్సి వస్తుంది. మీ తొందరపాటు నిర్ణయాలు వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆస్తి వ్యవహారాలు, భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహించండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలు కుంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
ధనస్సు : అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. శత్రువులు, మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయానికి మంచి ఖర్చులు అధికమవుతాయి. చిన్న తరహా పరిశ్రమలలో వారికి సంతృప్తికానరాగలదు. బంధువుల రాకతో ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. 
 
మకరం : ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. శత్రువులు మిత్రులుగా మారతారు. కుటుంబ విషయాలకు సంబంధించిన ఆలోచనలు చుట్టుముడుతాయి. స్త్రీలకు విలాస వస్తువులు, ఆడంబరాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కుంభం : బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకు, ఆందోళనలు అధికమవుతాయి. మీ రాక బంధువులకు ఆనందాన్నిస్తుంది. స్త్రీలకు షాపింగ్ విషయాలలోను వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మీనం : ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. లాయర్లకు ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు