04-12-2020 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించడం వల్ల శుభం

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (04:58 IST)
మేషం: దంపతుల మధ్య అవగాహనా లోపం వంటి చికాకులను ఎదుర్కొంటారు. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. పాత రుణాలు తీరుస్తారు. కుటుంబ విషయాలకు, ఆర్థిక లావాదేవీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కీలకమైన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు. 
 
వృషభం: స్త్రీలకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. తొందరపడి మాట ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. 
 
మిథునం: గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదాపడతాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వల్ల దేనిలోనూ ఏకాగ్రత వహించలేరు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా నడుస్తాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం: సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులను గుర్తిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంట్, వ్యాపారులకు కలిసివస్తుంది. బంధువుల రాక వల్ల మీరు కొంత అసౌకర్యానికి లోనవుతారు. 
 
సింహం: కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రముఖుల కలయిక అనుకూలించదు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
తుల: ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. సోదరీ, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఓర్పు, శ్రమాధిక్యతతో మీరు అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. విద్యార్థినులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం: హోటల్, తినుబండారాలు, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఖర్చులు రాబడికి తగినట్టుగా ఉంటాయి. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమన్వయం లోపిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు దొర్లటం వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
ధనస్సు: స్త్రీలకు దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. చేపట్టినన పనులు అసంపూర్తిగా ముగించవలసి వస్తుంది. ప్రేమికులకు సన్నిహితుల తోడ్పాటు, ఆదరణ లభిస్తాయి. 
 
మకరం: వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలలో సంతృప్తి కానవస్తుంది. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిదికాదు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కుంభం: వ్యాపారసంస్థల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగంలోని వారికి శ్రమ అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబీకుల కోసం ధనం వ్యయం చేస్తారు. ఏమరపాటుతనంతో ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు. 
 
మీనం: తలపెట్టిన పనులు వాయిదావేయవలసి వస్తుంది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యవహారాల్లో అనుకూలత, కార్యసాధనలో జయం పొందుతారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు