29-11-2020 - ఆదివారం మీ రాశి ఫలితాలు-సూర్యుడిని ఆరాధిస్తే..?

ఆదివారం, 29 నవంబరు 2020 (05:00 IST)
సూర్యుడిని ఆరాధించినట్లైతే ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంద. 
 
మేషం: తలపెట్టిన పనులు నిర్నిఘ్నంగా పూర్తి చేస్తారు. రావలసిన ధనం చేతికి అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. మీ ప్రయాణాలు, కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలెదురవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. 
 
వృషభం: కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
మిథునం: బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. చేతి వృత్తుల వారకి సదవకాశాలు లభిస్తాయి. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి. సహకార సంఘంలో వారికి చిన్న తరహా, రాజకీయాల్లోని వారికి అశాంతి అధికమవుతుంది.
 
కర్కాటకం: ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగస్తులకు రావలసిన మెడికల్ క్లయింలు, అలవెన్సులు మంజూరవుతాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు ఆశించినంత సంతృప్తినీయవు. మీ సంతానం భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఖర్చులు అధికమవుతాయి.
 
సింహం: పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. స్త్రీల మాటకు ఇంటా, బయటా ఆదరణ లభిస్తుంది. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కుటుంబీకులు, సన్నిహితుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. 
 
కన్య: బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ట్రాన్స్ పోర్ట్, ఆటో మొబైల్, మెకానికల్ రంగాల వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి.
 
తుల: ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత, ఒత్తిడి, చికాకు తప్పదు. పండ్ల, పూల, కూరగాయ నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. మీ సంతానం వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
వృశ్చికం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. ముఖ్యుల నుంచి అందిన ఆహ్వానాలు మీకు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా తొందరపాటుతనంతో జారవిడుచుకుంటారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
ధనస్సు: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులు చికాకులను ఎదుర్కొంటారు.
 
మకరం: విపరీతమైన ఖర్చులు, ధనం నిల్వచేయకపోవడం వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. స్త్రీలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. పాత మిత్రుల కలయిక మీలో పలు ఆలోచనలను రేకెత్తిస్తుంది.
 
కుంభం: వృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం, గౌరవం లభిస్తాయి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ప్రలోభాలు, ఒత్తిళ్లకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 
 
మీనం: ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. మిమ్మల్ని విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు