06-01-2020 సోమవారం మీ రాశి ఫలితాలు

సోమవారం, 6 జనవరి 2020 (06:00 IST)
మేషం: ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి వంటివి తప్పవు. ప్రైవేట్ సంస్థల్లోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావాల్సి వస్తుంది. వృధా ఖర్చులు మరింత అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య చికాకులు తలెత్తుతాయి. స్త్రీలు అనవసరపు విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. 
 
వృషభం: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కీలకమైన వ్యవహారాల్లో భాగస్వాముల నుంచి వ్యతిరేకత, పట్టింపులు ఎదురవుతాయి. ప్లీడర్లకు, వైద్య రంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థుల చురుకుదనం, పాఠ్యాంశాల పట్ల వారి ఏకాగ్రతకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మిథునం: చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మందులు, ఎరువులు, ఫ్యాన్సీ రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. బంధుమిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. గృహంలో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
 
కర్కాటకం: బ్యాంకింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పని ప్రారంభించకుండా ఎలా పూర్తవుతుందన్న ఆలోచన అర్థరహితమని గమనించండి. దూరపు బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
 
సింహం: స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సంఘంలో ఆదర్శ జీవనం జరుపుతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. సభ, సమావేశాల్లో పాల్గొంటారు. సమయానికి మిత్రులు సహకరించకపోవడంతో సంప్రదింపులు జరుపుతారు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు.
 
కన్య: వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు వ్యవహారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. 
 
తుల: కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. మెళకువ వహించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రీవారి మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం.
 
వృశ్చికం: ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయమని గమనించండి. మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. 
 
ధనస్సు: ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. స్త్రీలకు షాపింగ్ విషయాల్లో మెళకువ అవసరం. చిన్నతరహా పరిశ్రమలు, కార్మికులకు శ్రమాధిక్యత చికాకు తప్పదు. ఉమ్మడి, విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మకరం: తల, ఎముకలకు సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం ఉత్తమం. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. 
 
కుంభం: స్త్రీలు, టీవీ, ఛానల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందు లెదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తగలవు. బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాట వచ్చును. 
 
మీనం: స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. ఉద్యోగస్తుల శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. బంధుమిత్రుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు