ఆర్థికస్థితి నిరాశాజనకం. దుబారా ఖర్చులు విపరీతం. నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు సాగవు. సన్నిహితుల కలయిక వీలుపడదు. ఆశావహదృక్పథంతో మెలగండి. పత్రాలు అందుకుంటారు.
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రయాణం విరమించుకుంటారు.
కలిసివచ్చే సమయం. పరిచయాలు బలపడతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ సమస్యలను ధీటుగా ఎదుర్కుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రశంసలందుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
అవకాశం చేజారిపోతుంది. నిస్తేజానికి లోనవుతారు. సన్నిహితులకు తెలియజేయండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. శుభకార్యానికి హాజరవుతారు.
అనుకున్నకార్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. వాహనదారులకు అత్యుత్సాహం తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
ఊహించిన ఖర్చులే ఉంటాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియచేయండి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. పంతాలకు పోవద్దు. ఎదుటివారి తీరును గమనించండి. ధనలాభం ఉంది. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పనులు చురుకుగా సాగుతాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది.