07-12-2019 శనివారం మీ రాశి ఫలితాలు

శనివారం, 7 డిశెంబరు 2019 (05:00 IST)
మేషం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. కళ, క్రీడా రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీల మనోవాంఛలు నెరవేరగలవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒడిదుడుకులు వంటివి ఎదుర్కొంటారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడతాయి. ఆకస్మికంగా ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం. 
 
వృషభం: కుటుంబీకులను పట్టించుకునేందుకు క్షణం తీరిక వుండదు. దైవ, సేవా, పుణ్య కార్యాలయాల్లో నిమగ్నలవుతారు. పొదుపు పథకాలపై శ్రద్ధ వహించండి. పెద్దల ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మిథునం: భాగస్వామిక ఒప్పందాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తికాగలవు. నిరుద్యోగులు ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలి. హామీలు, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు.
 
కర్కాటకం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆకర్షణీయమైన పథకాలతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. మిమ్ములను తప్పుత్రోవ పట్టించి లబ్ధి పొందటానికి యత్నిస్తారు.
 
సింహం: దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు టీవీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. బాధలను పక్కనబెట్టి సంతోషమైన జీవితాన్ని గడపండి. హోటల్, తినుబండారాల, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కన్య: ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, పనియందు అంకితభావం అవసరం. విద్యార్థినులు ఒత్తిడి, చికాకులకు గురవుతారు. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు.
 
తుల: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు చురుకుగా సాగుతాయి. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. 
 
వృశ్చికం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. రాజకీయనాయకులు, సభ సమావేశాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిరు వ్యాపారులకు లాభదాయకం.
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కొంటారు. విజ్ఞతతో వ్యవహరించి రుణదాతలను సమాధాన పరుస్తారు. మీ వాక్చాతుర్యం, లౌక్యంతో అనుకున్నది సాధిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మకరం: ఉద్యోగస్తులు పై అధికారులతో ముక్తసరిగా మాట్లాడుతారు. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఎలాంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు.
 
కుంభం: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెంటాడుతుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల కోసం బాగా వ్యయం చేస్తారు. కూర, పండ్ల, కొబ్బరి, ధాన్య స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. పాత రుణాలు తీరుస్తారు. దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి.
 
మీనం: మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు