11-04-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు- మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే..?

ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (05:00 IST)
ఆదివారం మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: రుణాలు, పెట్టుబడులు కోసం ప్రయత్నిస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ శ్రీమతి ఆరోగ్యంలో మెళకువ వహించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
వృషభం: ఆర్థిక విషయాల్ల స్వల్ప ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ బంధువులను సహాయం అర్ధంచే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. 
 
మిథునం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనవసరపు విషయాలలో ఉద్రేకం మాని తెలివితేటలతో ముందుకు సాగి జయం పొందండి. 
 
కర్కాటకం: రాజకీయ నాయకులు ప్రముఖులను కలుసుకుని బహుమతులు అందజేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబందించిన చికాకులు అధికమవుతాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవడం వలన ఆందోళన పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
సింహం: బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. 
 
కన్య: చిన్నతరహా పరిశ్రమలకు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 
 
తుల: ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. బంధుమిత్రులతో పట్టింపు లెదుర్కొంటారు. ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం: సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా వుండండి. పాత బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు: సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత పురోభివృద్ధి వుండదు.
 
మకరం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ప్రత్యర్థులు వేసే పథకాలు ధీటుగా ఎదుర్కొంటారు. పెద్దమొత్తం ధనం, నగదుతో ప్రయాణాలు మంచిది కాదు. పాత బంధుమిత్రుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. 
 
కుంభం: ప్రత్తి, పొగాకు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీలకు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన మంచిది. సోదరీ, సోదరులతో సంబంధాలు బలపడతాయి. 
 
మీనం: స్త్రీలకు పనిభారం అధికమవడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. క్రయ విక్రయ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దలతోను, ప్రముఖులతోను ఏకీభవించలేరు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి పనిభారం అధికం. అధికారుల కలయిక సంతృప్తినిస్తుంది. సినిమా, సాంస్కృతిక రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు