Lunar Eclipse: మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..

సెల్వి

శనివారం, 21 ఫిబ్రవరి 2026 (22:05 IST)
చంద్ర గ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడుతోంది. దీని ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మీన రాశులవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ గ్రహణ ప్రభావం 4వ తేదీ మీద కూడా ఉంటుంది. ఈ రాశుల వారు ఆదిత్య హృదయాన్ని, విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ఎక్కువ పర్యాయాలు పఠించడం మంచి ఫలితాలు ఇస్తుంది. 
 
మిథున రాశికి భాగ్య స్థానంలో ఏర్పడుతున్నందువల్ల అవమానాలకు, అపనిందలకు బాగా అవకాశం ఉంది. ప్రయాణాల్లో గానీ, ఇంట్లో గానీ విలువైన వస్తువులు కోల్పోవడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది. 
 
కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొత్త ప్రయత్నాలేవీ తలపెట్టకపోవడం మంచిది. ఒప్పందాల మీద సంతకాలు చేయవద్దు. సింహం ఈ రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడికి గ్రహణం పడుతున్నందువల్ల ఈ రాశివారి మీద అపనిందలు, ఆరోపణలు, విమర్శలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. 
 
తులా రాశికి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల అపనిందలు, విమర్శలకు అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో అధికారులు, బయట బంధుమిత్రుల వల్ల మాటలు పడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులు గృహ నిర్మాణ విషయాల్లో మోసపోవడం జరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. 
 
మీన రాశికి వ్యయ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో సహోద్యోగులు, వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు, కొందరు బంధుమిత్రుల వల్ల మోసపోవడానికి అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు