12-06-2021 శనివారం దినఫలాలు - ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తారు...

శనివారం, 12 జూన్ 2021 (04:00 IST)
మేషం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలలో లాభసాటిగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. 
 
వృషభం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు రాగలవు. ప్రియతములతో సఖ్యత నెలకొంటుంది. 
 
మిథునం : ఉద్యోగస్తులకు తోటివారి సహకారం, అధికారుల అండదండలు లభిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూలు వాయిదాపడతాయి. బంధువులతో సంబంధాలు సన్నగిల్లుతాయి. దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు, చెల్లింపులు అధికంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. 
 
కర్కాటకం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. భాగస్వామిక వ్యాపారాలు ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలతో  సంభాషించేటపుడు సంయమనం పాటించండి. సోదరీ, సోదరులు మధ్య పోరు అధికంగా ఉంటుంది. 
 
సింహం : ఊహించని ఖర్చులు అధికం కావడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. నూతన పరిచయాలు లబ్దిని చేకూర్చుతాయి. కార్యసాధనలో చిన్నచిన్న ఆటంకాలెదురైనా ధైర్యంగా అడుగు ముందుకువేయండి. మీ సంతానంపై ప్రేమ, వాత్సల్యం పెంపొదుతాయి. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిదికాదని గమనించండి. 
 
కన్య : పీచు, ఫోం లెదర్, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం. చికాకులను ఎదుర్కొంటారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విజయం సాధించిన రోజు దూరమైన వారు తప్పక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. 
 
తుల : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యంతో ఎంతటి కార్యమైనా సాధించగలుగుతారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగును. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేక ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అసవరం. 
 
వృశ్చికం : రాజకీయాలలోని వారు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నరాలు, తల ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది 
 
ధనస్సు : బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. రవాణా రంగాల వారికి ఒత్తిడి చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. ఊహించని విజయం మిమ్మల్ని విజయంతో ముంచెత్తుతుంది. 
 
మకరం : మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరదు. వసతి ఏర్పాట్ల విషయంలో ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. శ్రీమతి శ్రీవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు అధిక శ్రమ దూర దేశాలు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
కుంభం : ఉద్యోగస్తులకు హోదా పెరిగే సూచనలున్నాయి. స్త్రీలకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం ఒకందుకు మంచిదే. మీ సంతానం విజయంతో మానసికంగా కుదుటపడతారు. 
 
మీనం : ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు చికాకులు తప్పవు. మీ అభిప్రాయాలు, మనోభావాలు సున్నితంగా వ్యక్తం చేయండి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవలసి వస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు అర్జిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు