12-10-2020 సోమవారం రాశిఫలాలు - ఈశ్వరుడిని పూజిస్తే జయం.. (video)

సోమవారం, 12 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. దూర ప్రదేశంలో ఉన్న మీ సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. విలువైన వస్తువులు, నగదు విషయాల పట్ల జాగ్రత్త అవసరం. స్త్రీలకు షాపింగ్‌లో ఏకాగ్రత ప్రధానం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. 
 
వృషభం : సంగీతం, నృత్య కళాకారులకు ప్రోత్సాహకరం. కొనుగోలుదార్లను తేలికగా ఆకట్టుకుంటారు. చిన్నారుల ఆరోగ్యం కలవరపరుస్తుంది. ఏ విషయంపై ఆసక్తి అంతగా ఉండదు. పెద్ద మొత్తంలో ధన సహాయం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహరుస్తాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 
 
మిథునం : వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, సునిశిత పరిశీలన ముఖ్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులను కలుసుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కర్కాటకం : బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. బెట్టింగ్‌లు జూదాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవససరం. ఉద్యోగస్తులు, యూనియర్ వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. దంపతుల మధ్య దూరపు ప్రస్తావన వస్తుంది. విద్యార్థులు వాహనాన్ని నిదానంగా నడపాలి. 
 
సింహం : వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కొంటారు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి, ఆందోళన కలిగిస్తుంది. సోదరీ, సోదరుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు పదేపదే జ్ఞప్తికి వస్తాయి. ఏది జరిగినా మంచికేనని భావించండి. 
 
కన్య : కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. తమ మాటే నెగ్గాలన్న పంతం ఇరువురికి తగదు. సానుకూలంగా మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ సంతానం పై చదవుల విషయంలో ఆందోళన తొలగుతుంది. 
 
తుల : దైవ, సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. పనులు కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. గత సంఘటనలు, అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు అతికష్టంమ్మీద సెలవులు మంజూరవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టిసారిస్తారు. సహోద్యోగులతో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. మీ వాహనం ఇతరులకు ఇవ్వొద్దు. వృత్తిపరంగా చికాకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఖర్చులు ప్రయోజనకరం. వేధింపుల అధికారి బదిలీవార్త ఉద్యోగస్తులకు సంతోషం కలిగిస్తుంది. 
 
ధనస్సు : వృత్తుల వారికి గుర్తింపు ఆదాయాభివృద్ధి. బంధువులను కలుసుకుంటారు. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు పనులు సమకూర్చుకుంటారు. రుణం తీర్చడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. వ్యాపారాల్లో పోటీ పనివారలతో చికాకులు ఎదుర్కొంటారు. 
 
మకరం : పారిశ్రామికవేత్తలకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతనంవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పట్టువిడుపు ధోరణితో సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
కుంభం : వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. నగదు చెల్లింపుల్లో తొందరపడవద్దు. ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయండి. స్త్రీలకు టీవీ చానెళ్ల కార్యక్రమంలో అవకాశం వస్తుంది. మీకు ఆందోళన కలిగించిన సమస్య తేలికగా సమసిపోతుంది. 
 
మీనం : సావకాశంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. అలవాటు లేని పనులు, అవగాహన లేని విషయాలుక దూరంగా ఉండాలి. హోల్‌సేల్, రిటైల్, పెద్దమొత్తం స్టాక్ అప్రమత్తంగా ఉండాలి. వృత్తిపరమైన సంబంధాలు బలపడతాయి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు