15-04-2021 గురువారం దినఫలాలు - వినాయకుడుని ఆరాధించినా...

గురువారం, 15 ఏప్రియల్ 2021 (04:00 IST)
మేషం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ చిత్తశుధ్ధి నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తులవారికి బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రయత్నాలను కొంతమంది పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
వృషభం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం.
 
మిథునం : ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. మితిమీరిన ఆలోచనలు, శ్రమాధిక్యతవల్ల స్వల్పంగా అనారోగ్యానికి గురవుతారు. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. చేతలో ధనం నిలవడం కష్టమవుతుంది. వాహన నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. 
 
కర్కాటకం : ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. వ్యాపారులకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికమవుతాయి. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. మీ సంతానం విద్యా విషయాలు ఆందోళన కలిగిస్తాయి. 
 
సింహం : వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగానే సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. విదేశీ రుణ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. 
 
కన్య : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం చేపట్టిన పనులు ఆశించినత చురుకుగా సాగవు. కీలకమైన బాధ్యతలు ఇతరులకు అప్పగించడం మంచిదికాదు. దంపతుల మధ్య కలహాలు అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. వాణిజ్య ఒప్పందాలు, వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. 
 
తుల : లాయర్లకు, ఆడిటర్లకు సదావకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు. ఆకస్మిస ధనప్రాప్తి, వాహనయోగం పొందుతారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గమనిస్తారు. ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. ధనవ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. 
 
వృశ్చికం : మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. తలకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓపిగ్గా వ్యవహరించండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వేళతప్పి భుజించుట, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
ధనస్సు : బంధు మిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. నూతన వ్యాపారాలపట్ల మెళకువ వహించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది ప్రతీ విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. 
 
మకరం : వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిక్తాయి. కృషి రంగానికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. 
 
కుంభం : ముఖ్యులతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. స్త్రీలకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభం చేకూరుతుంది. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 
 
మీనం : రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్యుల మధ్య అసందర్భపు మాటలు తలెత్తే అవకాశం ఉంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ఏజెంట్లు, బ్రోకర్లు, రిప్రజెంటేటివ్‌లకు మిశ్రమ ఫలితం. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు