21-02-2020 మంగళవారం మీ రాశి ఫలితాలు.. గజేంద్ర మోక్షం పారాయణ చేసినట్లైతే?

మంగళవారం, 21 జనవరి 2020 (05:00 IST)
Gajendra moksham
గజేంద్ర మోక్ష పారాయణ చేసినట్లైతే 12 రాశుల వారికి శుభం కలుగుతుంది. 
 
మేషం: ఉద్యోగస్తుల ఓర్పు, నేర్పులకు ఇది పరీక్షా సమయమని గమనించండి. స్త్రీలకు పనిభారం అధికం. విద్యార్థులు చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ముందుకు సాగి జయం పొందండి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా వుండవు. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. 
 
వృషభం: ఆర్థికం బాగుగా స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ప్రేమికులు మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆలయాల సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
మిథునం: భాగస్వామికుల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి. మిత్రుల ద్వారా అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఆసక్తి కలిగిస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో మనస్పర్థలు తలెత్తుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత తప్పవు. కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకువ వహించండి.
 
కర్కాటకం: ఆత్మీయుల సాయంతో సమస్యను పరిష్కరించుకుంటారు పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విద్య, ఉద్యోగ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రుణబాధల నుంచి విముక్తి పొందుతారు.
 
సింహం: ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలేర్పడతాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. అనుకున్నది సాధించే వరకు శ్రమిస్తారు.
 
కన్య: ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. వాహన చోదకులకు దూకుడు తగదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
తుల: ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి.
 
వృశ్చికం: బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉపాధ్యాయులు, రిప్రజెంటేటివ్‌లు మార్పులకే చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ఆకర్షణలకు దూరంగా ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం.
 
ధనస్సు: కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పెద్దల ఆరోగ్యం సంతృప్తి. మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివరాలకు సంతృప్తికరం.
 
మకరం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యంలో మెళకువ అవసరం. బంధువులకు హామిలిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. 
 
కుంభం: ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
మీనం: మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం క్షేమదాయకం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వర్టర్, ఏసీ మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు