23-10-2020 శుక్రవారం రాశిఫలాలు - దుర్గాదేవికి అర్చన చేసి పూజ చేసినా...

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (08:39 IST)
మేషం : కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఏదో సాధించలేకపోయామన్న భావం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన చాలా అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృషభం : కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు, దంతాలు నరాలకు సంబంధించిన చికాకులెదుర్కోవలసివస్తుంది. ముక్కుసూటిగా పోయే మీతత్వం వివాదాలకు దారితీస్తుంది. ఆహార వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
మిథునం : స్త్రీలకు స్వీయ సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. స్తోమతకు మించిన వాగ్ధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితం ఆనందంగా గడిచిపోతున్నప్పటికీ మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. 
 
కర్కాటకం : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి ఆశాజనకం. మీ బంధువులు, కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఏ పని తలపెట్టినా అనుకోని అవాంతరం వచ్చిపడుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. 
 
సింహం : పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదాపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సాగిస్తారు. బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. 
 
కన్య : కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన కాలం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రాజకీయాలలో వారికి మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాల సందర్శనాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. 
 
తుల : స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. 
 
వృశ్చికం : దంపతుల మధ్య కలహాలు, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది. స్త్రీలు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. 
 
ధనస్సు : స్త్రీలకు నడుము, నరాలు, కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులు, మితిమీరిన ధన వ్యయంతో ఆందోళన చెందుతారు. 
 
మకరం : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులకు అధికారులకు మధ్య సమన్వయం లోపిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. 
 
కుంభం : మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలపై శకునాలు, ఎదుటివారి మాటలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్న తప్పిదమైన సునిశితంగా ఆలోచించడం క్షేమదాయకం. 
 
మీనం : నిత్యావసర సరకుల స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ సంతానం మొండివైఖరితో అసహనానికి గురవుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు