27-11-2020- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. శ్రీ మహాలక్ష్మిని ఎర్రని పూలతో..?

శుక్రవారం, 27 నవంబరు 2020 (04:00 IST)
శ్రీ మహాలక్ష్మీని ఎర్రని పూలతో పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. బంధువులు మీ స్థితిగతులను చూసి అసూయపడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు.
 
వృషభం: ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వ్యాపారస్తులకు చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. రావలసిన మొత్తం కొంత ముందు వెనుకలుగానైనా అందడం వల్ల ఇబ్బందులు అంతగా వుండవు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మిథునం: మార్కెటింగ్ రంగాల వారికి, పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏదైనా అమ్మకానికై చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయులను విమర్శించడం వల్ల చికాకులు తప్పవు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. 
 
కర్కాటకం: స్త్రీలకు తల, కళ్ళు, నడుముకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అప్పుడప్పుడు కళ్ళు, పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఆహ్వానాలు మీకెంతో సంతృప్తినివ్వగలవు. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆపత్సమయంలో ఒకరిని ఆదుకోవడం వల్ల ఆదరణ, గుర్తింపు లభిస్తాయి.
 
సింహం: ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృద్ధి కానవస్తుంది. చేపట్టిన పనుల్లో అనుకోని అవాంతరాలు, చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మెలకువ వహించండి. 
 
కన్య: ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులకు దారి తీస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. బంగారు, వెండి రంగాల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల ఆలోచనలు పరిపరి విధాలుగా వుండటం వల్ల మాటపడకతప్పదు.
 
తుల: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మధ్య మధ్య వైద్యుని సలహాలు వంటివి తప్పదు. అప్పుడప్పుడు ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
వృశ్చికం: నూనె, కంది, మిర్చి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. స్త్రీలకు దైవ, పుణ్య, శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
ధనస్సు: వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆత్మాభిమానం అధికం కావడం వల్ల ఎదుటివారితో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ప్రత్తి, పొగాకు, మిర్చి, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
మకరం: పారిశ్రామిక రంగాల్లో వారికి కార్మికులకు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తే ఆస్కారం వుంది. మెళకువ వహించండి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలిసి వుంటుంది. మీ వాక్చాతుర్యానికి మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. 
 
కుంభం: ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కుటుంబీకుల పట్ల ఆసక్తి కనపరుస్తారు. కిరణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. 
 
మీనం: వైజ్ఞానిక శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు సహాయం అందిస్తాననే వారి నుంచి సమస్యలు తలెత్తుతాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. గృహోపకరణాల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు