31-05-2021 సోమవారం రాశిఫలితాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా...

సోమవారం, 31 మే 2021 (04:00 IST)
మేషం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ముందు ఆలోచన మంచిది. మీ అభిప్రాయాలను, ఆలోచనలు బయటికి వ్యక్తం చేయకండి. ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడుట మంచిది. తొందరపడి వాగ్ధానాలు చేయకండి. హామీలు ఇవ్వడం వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు. 
 
వృషభం : కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన పెట్టబుడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ యత్నాల్లో కొంత పురోగతి ఉంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు అప్రమత్త అవసరం. 
 
మిథునం : ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు ఆదుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. రావలసిన బిల్లులు మంజూరవుతాయి. 
 
కర్కాటకం : ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినివ్వగలవు. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. నిరుద్యోగులకు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. బంధు మిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
సింహం : సత్కాలం ఆసన్నమైంది. నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందగలవు. ఎదుటివారి తీరును గమనించి ముందుకుసాగండి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు, పట్టుదల, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కన్య : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో చికాకులు తప్పవు. మీ జీవిత భాగస్వామి సలహా పాటిస్తారు. 
 
తుల : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు మందుకు వేస్తారు. ఉద్యోగస్తులు, ప్రైవేటు సంస్థలలో వారికి అధికారులతో అవగాహన కుదరదు. మత్స్యు, పాడి పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది. బేకరీ, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. 
 
వృశ్చికం : వృత్తి వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటారు. ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థినులు విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు : ఏసీ, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి లాభదాయకం., శుభదాయకం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. 
 
మకరం : ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా ఆలోచనలు చేస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. వైద్యులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కుంభం : కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. సినిమా, సంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. 
 
మీనం : అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి చికాకు, ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాభివృద్ధికి కానవచ్చిన, పనివారితో చికాకులు తప్పవు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు