ఆర్ధికస్థితి నిరాశాజనకం. ఖర్చులు విపరీతం. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. రాజీమార్గంలో సమస్య పరిష్కారమవుతుంది. శుభకార్యానికి హాజరవుతారు.
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పనుల్లో శ్రమ అధికం. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు.
ముఖ్యమైన వ్యవహారంపై పట్టుసాధిస్తారు. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పరిచయస్తులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
స్ధిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. చిట్స్, ఫైనాన్స్ల జోలికి పోవద్దు. మొదలెట్టిన పనులు ఒకపట్టాన పూర్తికావు. చీటికిమాటికి చికాకుపడుతుంటారు. కార్యక్రమాలు ముందుకు సాగవు.
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రలోభాలకు లొంగవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శుభకాకార్యాన్ని ఘనంగా చేస్తారు. విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉత్సాహంగా శ్రమించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. మితంగా సంభాషించండి.
కొంతమేరకు అనుకూలం. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు.. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ధనసమస్యలు తలెత్తకుండా చూసుకోండి. ఆటంకాలెదురైనా పనులు పూర్తిచేయగల్గుతారు. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పధంతో మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.