ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా వ్యవహరిస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. ఖర్చులు అంచనాలు మించుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త.
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. అకారణంగా మాటపడవలసి వస్తుంది. పనులు పురమాయించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. హోల్సేల్ వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త పనులు ప్రారంభిస్తారు. సాయం ఆశించవద్దు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతిని సంప్రదిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. వాహనదారులకు దూకుడు తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యాపారాలు బాగుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. పనివారలను ఓ కంట కనిపెట్టండి. బాధ్యతలు అప్పగించవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు.
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవకాశాలు చేజారిపోతాయి. ఇదీ ఒకందుకు మంచికే. రావలసిన ధనం అందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారుం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రయాణం చేయవలసి వస్తుంది.
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించి భంగపడతారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదర్శనంలో అవస్థలెదుర్కుంటారు.