శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ॥ ద్వాదశి తె. 5.01 చిత్త ఉ.9.16 ప.వ.3.11 ల 4.53. ఉ. దు. 6.16 ల 7.45.
శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన శుభం కలుగుతుంది.
మేషం :- ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు ఆరోగ్య విషయమై వైద్యులను సంప్రదిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వృషభం :- ఉద్యోగస్తుల అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. మీ కళత్ర మొండివైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ, ఏకాగ్రత అవసరం.
మిథునం :- దైవ, పుణ్యకార్యాలకు ధనం ఇతోధికంగా ఖర్చుచేస్తారు. ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం ఉంది. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. ధన లాభంతో పాటు మీ కీర్తిప్రతిష్ఠలు మరింత పెరిగే ఆస్కారముంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
కర్కాటకం :- చెక్కులు జారీ సంతకాల విషయంలో అప్రమత్తత అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఖర్చుల విషయంలో ఏమాత్రం రాజీకిరారు. బంధు, మిత్రులను కలుసుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి సహకరిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలించవు.
సింహం :- మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. దైవ, పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళుకువ అవసరం. పెద్దలు పరోపకారానికి పోవటం వల్ల మాటపడవలసివస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
కన్య :- వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు బలపడతాయి. మీ సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. రాజకీయాల్లోని వారు సభలలో పాల్గొంటారు. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉంటుంది.
తుల :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. గృహం ఏర్పరచుకోవాలి అనే కోరిక బలపడుతుంది.
వృశ్చికం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థునుల ప్రతిభాపాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. లాయర్లకు కయింట్లతో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి.
ధనస్సు :- బంధు మిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాల లక్ష్యం అనుకూలిస్తుంది. విద్యార్థినులకు పరీక్షల్లో ఏకాగ్రత, సమయపాలన చాలా అవసరం. దాంపత్య సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. తలకు మించిన భాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓప్పిగా వ్యవహరించండి.
మకరం :- బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీలు విందు, వినోదాలు, విలువైన వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతరులపై ఆధారపడక మనస్థైర్యంతో ముందుకు సాగండి. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశ సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు.
కుంభం :- సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పక పోవచ్చు. హామీలు, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల నుండి చికాకులు తప్పవు. బంధు మిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. ధనం మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చవుతుంది.
మీనం :- దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. బెట్టింగులు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుకుంటారు.