నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

ఠాగూర్

శుక్రవారం, 10 అక్టోబరు 2025 (19:10 IST)
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నోబెల్ శాంతి పురస్కారం కోసం ఆరాటపడ్డారు. ప్రపంచంలో తాను ఎనిమిది యుద్ధాలను ఆపానంటూ ఢంకా బజాయించుకున్నారు. అదేసమయంలో ఆయనకు పలు దేశాలు మద్దతు పలికాయి. పాకిస్థాన్ వంటి దేశాలు ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేస్తూ ఏకంగా లేఖ కూడా రాసింది. కానీ, శుక్రవారం ప్రకటించిన పురస్కారంలో ఆయన పేరు లేదు. 
 
ఈ నేపథ్యంలో కొన్ని దేశాల నుంచి మద్దతు వచ్చినప్పటికీ నోబెల్ రాకపోవడంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్‌ జొర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్‌ స్పందించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా విజేతలను ఎంచుకుంటామని చెప్పారు. 'ఈ కమిటీ మీడియా, బహిరంగ ప్రచారాలను గమనిస్తోంది. నోబెల్‌ గ్రహీతల చిత్రాలు ఉన్న గదిలో కూర్చుని ఆ లేఖలను మేం చూస్తాం. ఆ గది మాకు ధైర్యాన్నిస్తుంది. సమగ్రతతో పనిచేసే సంకల్పాన్ని కలిగిస్తుంది. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ ఆశయాలకు అనుగుణంగా మేం నిర్ణయాలు తీసుకుంటాం' అని వెల్లడించారు.
 
త్వరితగతిన దక్కిన దౌత్య విజయాలకంటే.. స్థిరమైన, బహుపాక్షిక ప్రయత్నాలకు కమిటీ ప్రాధాన్యం ఇస్తుంటుంది. ట్రంప్ ప్రయత్నాలు సుస్థిర ఫలితాలు ఇస్తాయని ఇంకా నిరూపితం కాలేదని హెన్నీ జాక్సన్ సొసైటీలో చరిత్రకారుడుగా ఉన్న థియో జెనౌ అభిప్రాయం వ్యక్తంచేశారు. 'ఒక ఘర్షణను స్వల్పకాలంపాటు ఆపడానికి.. దాని మూలకారణాలు గుర్తించి, పరిష్కరించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది' అని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు