11-01-2023 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా...

బుధవారం, 11 జనవరి 2023 (04:00 IST)
మేషం :- నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. ప్రేమానుబంధాలు బలపడతాయి. రిప్రజెంటేటివ్‌లు, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని ఉద్యోగస్తులకు స్థానమార్పిడికి ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహారాలు, పాతసమస్యలు చికాకుపరుస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయుయత్నంలో సఫలీకృతులవుతారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం :- చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. దైవ, పుణ్యకార్యాలకు ఇతోధికంగా సహకరించటం వల్ల మీ గౌరవ, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
మిథునం :- విద్యార్ధులు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. దూరప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ వహించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభం. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. చేపట్టిన పనులలో ఏకాగ్రతా లోపం, వృధా ప్రయాసలు వంటి చికాకులు ఎదుర్కుంటారు.
 
కర్కాటకం :- ఇతరుల వాహనం నడపటం వల్ల ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఆవగాహన లోపిస్తుంది.
 
సింహం :- పారిశ్రామిక రంగంలోని వారికి విద్యుత్ కోత, కార్మిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. విద్యార్ధులకు అనుకోని చికాకులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక, యోగా, సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిర్మాణ పనులలో పురోభివృద్ధి, సకాలంలో పూర్తి అయ్యే సూచనలు కానవస్తాయి.
 
కన్య :- లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు వాయిదాపడటం మంచిది. మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. రుణయత్నంలో ఆటంకాలు తొలగిపోతాయి. కొన్ని అనుకోని ఖర్చుల వల్ల మీ ఆర్ధిక ప్రణాళకలకు భంగం వాటిల్లే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
తుల :- వైద్యులను శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అపరిచితుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో అనుక్షణం సంయమనంతో వ్యవహరించటం అన్ని విధాలా శ్రేయస్కరం.
 
వృశ్చికం :- కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్త్రీలకు దైవకార్యాలు, ఇతర వ్యాపకాల వైపు దృష్టి మళ్ళుతుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. నిరుద్యోగులు ఎటువంటి ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో వ్యవహరించటం అన్ని విధాలా శ్రేయస్కరం.
 
ధనస్సు :- గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయుకృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరువ్యాపారాలకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
మకరం :- ఆర్థిక ఇబ్బందులు అధికం అయినా మిత్రుల సహకారంతో సమసిపోతాయి. పుణ్యక్షేత్రాను సందర్శిస్తారు. బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. అధిక శ్రమతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి.
 
కుంభం :- పీచు, ఫోం, లెదర్, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఆడంబరాలకుపోయి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ మార్పిడికై చేయుయత్నాలు త్వరలోనే ఫలించగలవు. ఆకస్మికంగా మీరు తీసుకున్న ఒక నిర్ణయం కుటుంబీకులను బాధించగలదు. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
మీనం :- రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి ఆశాజనకం. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఖర్చులు అధికమైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. మిత్రులను కలిసుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు