20-12-2023 బుధవారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా మీ సంకల్పం...

బుధవారం, 20 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ|| అష్టమి ప.1.56 ఉత్తరాభాద్ర రా.1.40 ప.వ.12.11 ల 1.41. ప. దు. 11. 28 ల 12.12.

శంఖరుడిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనిస్తాయి. స్త్రీలకు బంధువుల ఆదరణ, మర్యాదలు సంతృప్తినిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు.
 
వృషభం :- హామీలు, మధ్యవర్తిత్వాలు ఉండటం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
మిథునం :- పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులదైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆకస్మిక చెల్లింపుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది.
 
కర్కాటకం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది. 
 
సింహం :- బదిలీపై వచ్చిన అధికారులకు ఉద్యోగుల సత్కారం, సహాయ సహకారాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదఉండదు.
 
కన్య :- సన్నిహితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు.
 
తుల :- నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసివస్తుంది.
 
వృశ్చికం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. పాత రుణాలు తీరుస్తారు. ఒక మంచి పని చేశామన్న సంతృప్తి మీలో నెలకొంటుంది. ప్రముఖులను కలసి బహుమతులను అందజేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమఫలితం.
 
ధనస్సు :- బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
 
మకరం :- ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి జయం పొందండి. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసివస్తుంది. బంధువులను కలుసుకుంటారు.
 
కుంభం :- ఎరువులు, క్రిమిసంహారక మందుల వ్యాపారులకు చికాకులు తప్పవు. కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. తోటలు కొనుగోలుకై చేయుప్రయత్నాలు వాయిదాపడుటవల్ల ఆందోళన చెందుతారు. పెరుగుతున్న ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్థికస్థితికి అవరోధంగా నిలుస్తాయి.
 
మీనం :- ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. ఉద్యోగస్తులు సమర్ధంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు