13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

రామన్

సోమవారం, 13 అక్టోబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు పురమాయించవద్దు. ప్రముఖులతో సంభాషిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. బాకీలు వసూలవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల్లో శ్రమ అధికం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణవిముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. పనులు వేగవంతమవుతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. నిరుత్సాహానికి లోనుకావద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి సారిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పత్రాలలో సవరణలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకలు, విందులకు హాజరవుతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు అధికం. పనులు సానుకూలమవుతాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వేడుకలు, విందులకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా అనుకోవద్దు. ఖర్చులు విపరీతం. సన్నిహితులు సాయం అందిస్తారు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. పత్రాలు అందుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పిల్లల వైఖరి అసహనం కలిగిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దూరపు బంధువులతో సంభాషిస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యల కలయిక వీలుపడదు. తలపెట్టిన కార్యం మొండిగా సాగిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు