23-09-2022 శుక్రవారం దినఫలాలు

శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (05:00 IST)
లక్ష్మీ అష్టోత్తరం చదవండి. 
 
మేషం:- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణంలోని మార్పుఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులనుకలుసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
వృషభం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థత, ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మంచి తనంతో విరోధులను ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు.
 
మిధునం:- స్త్రీల మనోవాంఛలు, అవసరాలు నెరవేరుతాయి. మీ ఆంతరంగి, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. పాతమిత్రులు,చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబలో కలతలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాకి, ఎంతో కొంత పొదపు చేయాలన్న మీ యత్నం ఫలించదు.
 
కర్కాటకం: - వీసా, పాస్పోర్టు వ్యవహారాలు సానుకూల మవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి. 
 
సింహం:- ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. రుణం కొంత మొత్తమైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ సంతానంతో సరాదాగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. మీ అంచనాలు, పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
కన్య: - ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
తుల: - రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమేణా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఒక సమాచార లోపం వల్ల సదవకాశాలు చేజారిపోతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది.
 
వృశ్చికం:- స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల,వస్తువుల పట్ల మెళుకువ అసవరం. దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకుంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తుతాయి. వృత్తిరీత్యా మీ బాధ్యతలు పెరుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు: - ఆర్ధిక విషయాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.
 
మకరం:- వృత్తి పరమైన చికాకులను ఎదర్కొనవలసివస్తుంది. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. బంధువులతో స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. వాహరం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు ఏకాగ్రత అవసరం.
 
కుంభం:- ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. ఓర్పు, పట్టుదలో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. రాజకీరు, సాంకేతిక వర్గాలవారికి శ్రమాధిక్యం తప్పదు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి.
 
మీనం:- ఉద్యోగస్తులు తోటివారి నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నగదు చెల్లింపు చెక్కుల జారి విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగినా ఇబ్బందు లుండవు. విదార్దులు చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు