26-08-2025 మంగళవారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌కు పాల్పడవద్దు...

రామన్

మంగళవారం, 26 ఆగస్టు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ శ్రమ ఫలిస్తుంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆశావహదృక్పథంతో అడుగువేయండి. సాయం ఆశించవద్దు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ధనసమస్యలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితులను కలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపులు ఆపవద్దు. అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం బాగుంటుంది. పందాలు, బెట్టింగ్‌కు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. నిపుణులను సంప్రదిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి.. అభియోగాలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. విమర్శలెదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అభీష్టం నెరవేరుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. బాకీలు వసూలవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలు కలిసివస్తాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. పత్రాలు, నగదు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. సమర్ధతను చాటుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. అనుకోని సంఘటనలెదురవుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు