09-12-2021 గురువారం రాశిఫలాలు : సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన శుభం...
గురువారం, 9 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- కొబ్బరి, పండు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ కుమారుని మొండివైఖరి చికాకు కలిగిస్తుంది.
వృషభం :- మీ ఉన్నతిని చాటుకోడటం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారి నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు.
మిథునం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులు మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.
కర్కాటకం :- వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితులు, అశాంతి క్రమంగా తొలిగిపోగలవు. బంధు మిత్రుల కలయితో మానసికంగా కుదుటపడతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిర బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు.
సింహం :- భాగస్వామిక వ్యపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. ప్రముఖులతో కలిసి విందులు, వేడుకలలో పాల్గొంటారు. శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది.
కన్య :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. రుణవిముక్తులయ్యేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఉపాధ్యాయులు సమయస్పూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
తుల :- ఉద్యోగస్తుల సమర్థతకు పై అధికారుల నుంచి గుర్తింపు, మన్ననలు లభిస్తాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. మీ వ్యాఖ్యలను బంధు మిత్రులు అపార్థం చేసుకుంటారు. గృహంలో ఒక శుభకార్యం నిమిత్తం యత్నాలు మొదలెడతారు.
వృశ్చికం :- వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యవహార ఒప్పందాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి రవాణా రంగాల వారికి ఇబ్బందులు అధికమవుతాయి. ప్రముఖుల నుండి ఆహ్వానం అందుతుంది. ఎదుటి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తారు.
ధనస్సు :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. విందులు, వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది.
మకరం :- ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. హామీలు, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఒకవ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.
కుంభం :- చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్య, చికాకులు ఎదుర్కుంటారు. బంధువులతో విభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. విందులు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబీకులను పట్టించుకునేందుకు క్షణం తీరిక ఉండదు. ఖర్చులు మీ రాబడికి తగినట్లుగానే ఉండగలవు. నిరుద్యోగులు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మీనం :- వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. బంధు మిత్రులతో కలసి విందుల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి కళకారులకు ప్రోత్సాహకరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆకర్షణీయమైన పథకాలతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి.