రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఠాగూర్

ఆదివారం, 19 అక్టోబరు 2025 (17:35 IST)
సాధారణంగా పెళ్ళికి వయసుతో సంబంధం లేదంటారు. కొన్ని వివాహాలు దీన్ని రూపిస్తున్నాయి కూడా. తాజాగా 74 యేళ్ల తర్వాత వయసులో తన కంటే 50 యేళ్ల చిన్నదైన 24 యేళ్ల  యువతిని వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం ఆ యువతికి 2 కోట్ల రూపాయల ఎదురుకట్నం ఇచ్చాడు. ఈ వివాహం ఇండోనేషియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోనేషియాకు చెందిన టార్మాన్ (74), అరికా(24)ల వివాహం తూర్పు జావా ప్రావిన్స్‌లోని పాసిటన్ రీజెన్సీలో అక్టోబరు 1న జరిగింది. ఈ వివాహం చేసుకునేందుకుగాను టార్మాన్ ఆ యువతికి దాదాపు రూ.2 కోట్లు చెల్లించాడు. అయితే ఫొటోగ్రాఫర్లకు మాత్రం డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్నారట. పెళ్లి అయిన తర్వాత తమకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా నవదంపతులు అదృశ్యమయ్యారని ఆ సంస్థ ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. 
 
అయితే, ఆ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. వధువుకు తొలుత రూ.60 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, వివాహ వేడుక సమయంలో ఏకంగా రూ.1.8 కోట్లు చెల్లించారట. ఇక పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా కొంత డబ్బును రిటర్న్ గిఫ్టుగా ఇచ్చారు. ఈ వేడుకలు ముగిసిన కొద్దిసేపటికీ.. నవ దంపతులు అదృశ్యమయ్యారు. వారిని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లభించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. టార్మాన్ వివాహ చర్చనీయాంశమైంది. 
 
ఇక, ఈ వివాహం వద్దు అంటూ ఆ యువతిని తాము ముందే హెచ్చరించామని వధువు తరపు బంధువులు ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు. అయినప్పటికీ.. ఆమె తమ మాటలను పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో తమ వివాహంపై వస్తున్న కథనాలపై టార్మాన్ స్పందించారు. వధువుకు డబ్బు చెల్లించిన విషయం నిజమేనని ధ్రువీకరించారు. అయితే, విడిపోయారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. మేము కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు