01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

రామన్

మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (14:50 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన సమయం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలివారి తాహతుకు తగ్గట్టుగా మెలగండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య పద్దుమణుగుతుంది. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. తరచుగా సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. పెద్దల ఆశీస్సులుంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. తరుచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. అప్రియమైన వార్త వింటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి శుభం జరుగుతుంది. ఉద్యోగసులకు పదోన్నతి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్యీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఏకపక్ష నిర్ణయం తగదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. కానుకులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవి దక్కకపోవచ్చు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. సంస్థల స్థాపనకు తగిన సమయం. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. సంతానానికి శుభయోగం. అనవసర విషయాల్లో జోక్యం తగదు. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల అలక్ష్యం తగదు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం కొంతమేరకు అనుకూలం. లావాదేవీలు కొలిక్కివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరాశపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచికే. త్వరలో శుభవార్త వింటారు. ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్తబాధ్యతలు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకు మీ సలహా ఆమోదయోగ్యయమవుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులు కలిసిరావు. చెల్లింపుల్లో జాప్యం తగదు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
ధనుర్‌ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. లక్ష్యానికి చేరవవుతున్నారు. ఓర్పుతో శ్రమిస్తే ఆశించిన ఫలితం సాధిస్తారు. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. స్నేహసంబంధాలు బలపడతాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. భేషజాలకు పోకుండా మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు పదోన్నతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు ఉన్నతికి దోహదపడతాయి. లక్ష్యం సాధించే వరకు యత్నాలు సాగించండి. అసాధ్యమనుకున్న పనులు పూర్తిచేయగల్గుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు ధనం అందుకుంటారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. పత్రాల్లో సవరణలు అనివార్యం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది, పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సంతానానికి శుభయోగం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒడిదుడుకులకు ధీటుగా స్పందిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారికి పురోభివృద్ధి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం యోగదాయకం. ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తుంటారు. ఒక సమస్య మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. పొదుపునకు ఆస్కారం లేదు. కొత్త పనులు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పత్రాల్లో మార్పుచేర్పులు అనివార్యం. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ఒత్తిళ్లు. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యూహాత్మకంగా అడుగు ముందుకేయండి. అతిగా ఆలోచింపవద్దు. ఓర్పు, దీక్షతోనే కార్యం సాధ్యమవుతుంది. సాయం ఆశించవద్దు. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాల్లో చిన్న చిన్న చికాకులు మినహ ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు