01-02-2021 నుంచి 28-02-2021 వరకూ ఫిబ్రవరి రాశి ఫలితాలు

సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (10:19 IST)
మేషరాశి: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము
ఈ మాసం అన్ని విధాలా అనుకూలమే. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ధనలాభం వుంది. ఖర్చులు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా వ్యవహరించండి. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ప్రోత్సహకరంగా సాగుతాయి. అకౌంట్స్, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. స్థిరాస్తి క్రయవిక్రయాల దిశగా ఆలోచిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం వుంది. ధన సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. గృహ మార్పు అనివార్యం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అనుకూలతలు అంతంతమాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆశాజనకం. పందాలు, జూదాల జోలికి పోవద్దు.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. ఖర్చులు సామాన్యం. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఏ పని చేయబుద్ధికాదు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఆప్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. గృహ మరమ్మతులు చేపడతారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. సరుక నిల్వలో జాగ్రత్త. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. స్థిరాస్తి క్రయవిక్రయంలో ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని విధాలా యోగదాయకమే. కార్యసిద్దికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు భారం అనిపించవు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. తొందరపడి మాట ఇవ్వద్దు. పెద్దల సలహా పాటించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులకు కొత్త చికాకులెదురవుతాయి. వేడుకకు హాజరవుతారు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మొహమాటం, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పెట్టుబడులకు తరుణం కాదు. అవివాహితుల ఆలోచనలు నిలకడగా వుండవు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. మీ అలవాట్లు అదుపులో వుంచుకోండి. 
 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 4 పాదములు
ప్రణాళికాబద్ధంగా అడుగు ముందుకేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. విద్యార్థులకు పని ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేతివృత్తుల వారికి ఆశాజనకం. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.
 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అన్ని రంగాల వారికి శుభదాయకమే. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఇచ్చినమాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా వుంటుంది. ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలు అతి కష్టమ్మీద నెరవేరుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో పునరాలోచన మంచిది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు అప్పగించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపరాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. విద్యార్థులకు ఒత్తిడి, ఏకాగ్రత లోపం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు అధికం. అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. శకునాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. సామరస్య ధోరణితో మెలగండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ఉద్యోగస్తులకు సమస్యలెదురవుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. వృత్తి, ఉపాధి పధకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. కొత్త సమస్యలెదురవుతాయి.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంతమాత్రమే. ఏ పని తలపెట్టినా మొదటికే వస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఓర్పుతో వ్యవహరించాలి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహనలోపం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనరాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదాలు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఏ సమస్యనైనా దీటుగా ఎదుర్కొంటారు. ఆశించిన పదవి దక్కకపోవచ్చు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. లాభసాటిగా సాగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వాహన చోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు