ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పు చేర్పులు సాధ్యమవుతాయి.
ఈ రోజు కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. రావలసిన ధనం అందుతుంది. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. విందుకు హాజరవుతారు.
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ సమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధువులతో విభేదిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆప్తులను కలుసుకుంటారు.
మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
వ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ఖర్చులు అధికం. నోటీసులు అందుకుంటారు. ఏ పనీ చేయబుద్ధి కాదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు పురమాయించవద్దు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఓర్పుతో మెలగండి. అతిగా ఆలోచింపవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.