సురేంద్రబాబు గారూ.. శేషనాగ సర్పదోషానికి శాంతి చేయించండి

మంగళవారం, 19 ఫిబ్రవరి 2013 (18:23 IST)
FILE
సురేంద్రబాబు-నెల్లూరు:

మీరు చతుర్థశి శుక్రవారం, సింహలగ్నము, ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశినందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల, శేషనాగ సర్పదోషం ఏర్పడింది. ఈ దోషానికి 54 రకాల మూలికలతో శాంతి హోమం చేయించి దానాలు ఇచ్చినా వివాహప్రాప్తి, అభివృద్ధి చేకూరుతుంది.

భార్యస్థానాధిపతి అయిన శని ధనస్థానము నందు ఉండటం వల్ల, వివాహానంతరం మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో శనిని పూజించండి శుభం కలుగుతుంది. మీ 33 లేక 34 సంవత్సరమునందు వివాహం అవుతుంది.

వెబ్దునియా పై చదవండి