శాంతిప్రియ-మహబూబ్ నగర్: మీరు పాడ్యమి శుక్రవారం, కర్కాటక లగ్నము, ఉత్తరా నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2017 వరకూ అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశి శనికి తైలాభిషేకం చేయించి తెల్లని పూలతో శనిని పూజించి, అర్చించినా శుభం, జయం చేకూరుతుంది. ఏదైనా దేవాలయంలో కానీ ఉద్యానవనంలో కానీ మోదుగ చెట్టును నాటిన సర్వదోషాలు తొలిగిపోతాయి. 2016 మే నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది.