ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. విందులకు హాజరవుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కొంతమంది వ్యాఖ్యలు బాధిస్తాయి. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు అధికం. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన, సమావేశంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు సానుకూలమవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
ప్రతికూలతలు అధికం. ఏ పని మొదలెట్టినా మొదటికే వస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండేందుకు యత్నించండి. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. పనులు ముందుకు సాగవు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
ప్రతికూలతలు అధికం. సమర్ధతకు గుర్తింపు ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు ప్రయోజనకరం. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వాహనం ఇతరులకివ్వవద్దు.