వెంకట్ శ్రీనివాస్-పొన్నూరు: మీరు చవితి సోమవారం, వృశ్చిక లగ్నం, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. 2017 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి కిలోంపావు బియ్యం, కిలోంపావు బొబ్బర్లు బ్రాహ్మణునికి దానం ఇచ్చినా శుభం కలుగుతుంది. రాజ్యస్థానము నందు బుధ, శుక్ర, కుజులు ఉండటం వల్ల ఉద్యోగంలో పని ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి లోపు మీకు వివాహమవుతుంది. వివాహం విషయంలో జాతక పరిశీలన చాలా అవసరమని గమనించండి. 2009 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2027 వరకు సత్ఫలితాలను ఇవ్వగలదు. దేవాలయంలో లేదా ఉద్యానవనంలో దేవదారు చెట్టును నాటండి. ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.