కె.కిషోర్ కుమార్-తాడిపత్రి: మీరు చవితి గురువారం, మేషలగ్నము జ్యేష్ట నక్షత్రం వృశ్చిక రాశి నందు జన్మించారు. 2019 వరకు ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ప్రతి శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా ఆటంకాలు తొలగిపోతాయి. 2016 లేక 2017 నందు ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడతారు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 2017 నుంచి రవి మహర్దశ 6 సంవత్సరములు చంద్రుడు 10 సంవత్సరములు, కుజుడు 7 సంవత్సరములు మొత్తం 23 సంవత్సరములు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏదేని దేవాలయంలో కానీ ఉద్యాన వనంలో కానీ కొబ్బరి చెట్టును నాటిన శుభం కలుగుతుంది.