ఎస్.సోమశేఖర్-తిరుపతి: మీరు సప్తమి శనివారం, మేష లగ్నము, పునర్వసు నక్షత్రం మిధున రాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన శుక్రుడు ధన స్థానము నందు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. 2016 నందు మీకు ఆకస్మికంగా వివాహమవుతుంది. భార్య స్థానము నందు యముడు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. ప్రతిరోజూ లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి కానరాగలదు. 2012 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2018 నుంచి 2028 వరకు యోగాన్ని, పురోభివృద్ధిని ఇస్తాడు. ఏదైనా వైష్ణవ దేవాలయాలలో గన్నేరు చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.