నాగేంద్ర కుమార్ బొమ్మిశెట్టి-గుంటూరు: మీరు ద్వాదశి బుధవారం, కన్యా లగ్నము, మూలా నక్షత్రం, ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. భార్య స్థానాధిపతి అయిన బృహస్పతి చదుర్థము నందు చంద్రునితో కలయిక వల్ల వివాహానంతరం మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. 2016 నందు తాత్కాలికంగా స్థిరపడతారు.
2016 లేక 2017 నందు మీకు వివాహమవుతుంది. వివాహానంతరం మీ భార్య పేరుతో వ్యాపారాలు చేసిన కలిసిరాగలదు. 2011 నుంచి చంద్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2017 నుంచి 2021 వరకూ సత్ఫలితాలను ఇస్తాడు. 2021 నుంచి కుజ మహర్దశ 7 సంవత్సరములు మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. ప్రతిరోజూ వాసుదేవుని ఆరాధించడం వల్ల సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. ఏదైనా దేవాలయాలలో వేగి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.