సంధ్యారాణి గంటా-కరీంనగర్: మీరు పంచమి ఆదివారం, మకర లగ్నము, విశాఖ నక్షత్రం, తులా రాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం నాడు 16 సార్లు ప్రదక్షణ చేసి మల్లెపూలతో శనిని పూజించండి. 16 ఒత్తులు ఏకం చేసి 3 నెలలకు ఒక శనివారం నాడు ఆవు నేతితో శనికి దీపారాధన చేయండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.
లగ్నము నందు కేతువు ఉండి, గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, తక్షక కాలసర్పదోష శాంతి చేయించండి. మీకు ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి, దినదినాభివృద్ధి కానరాగలదు. 2017 నుంచి మీరు వ్యాపారాలలో బాగుగా రాణిస్తారు. 2012 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2017 నుంచి 2029 వరకూ బాగుగా యోగాన్ని, అభివృద్ధిని ఇస్తాడు. ప్రతిరోజూ రాజరాజేశ్వరి అష్టకం చదవండి లేక వినండి. శుభం కలుగుతుంది.