మదన్ మోహన్ రాజు- సిద్దవటం(కడప)- మీరు అష్టమి గురువారం, కర్కాటక లగ్నము, విశాఖ నక్షత్రం, తులా రాశి నందు జన్మించారు. 2017 వరకూ ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి మల్లెపూలతో శనిని పూజించినా మీకు దోషాలు తొలగిపోతాయి. 2016 మే తదుపరి మీకు మంచి అవకాశం రాబోతుంది. 2017 నుంచి బుధ మహర్దశ 17 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ఏదైనా దేవాలయాలలో మొగలి చెట్టును నాటిన మీకు శుభం కలుగుతుంది.