విజయ్ - బెల్లంపల్లి: మీరు పంచమి ఆదివారం, మేష లగ్నం, రోహిణి నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. భాగ్యాధిపతి అయిన బృహస్పతి లగ్నము నందు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. ధనాధిపతి అయిన శుక్రుడు భార్య స్థానము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. వర్తమానం మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. 2016 నుంచి గురు మహర్దశ ప్రారంభమవుతుంది.
ఈ గురువు 16 సంవత్సరములు 67 శాతం యోగాన్ని ఇస్తుంది. 2017 నుంచి 2032 వరకూ మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. 2017 నందు మీకు వివాహం అవుతుంది. మీరు ప్రభుత్వ రంగ సంస్థలలో కంటే కార్పొరేట్ సంస్థలలో స్థిరపడతారు. ప్రతిరోజూ నీలకంఠేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. ఏదైనా ఉద్యానవనాలలో కానీ, దేవాలయాలలో కానీ నేరేడు చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.