( అనిల్-నిజామాబాద్): మీరు విదియ, గురువారం, ధనుర్ లగ్నం, ఉత్తరా నక్షత్రం, సింహ రాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు అర్థాష్టమ శనిదోషం ఉన్నందువల్ల శనికి శాంతి చేయించిన శుభం కలుగుతుంది. లగ్నము నందు రాహువు ఉండి, భార్య స్థానము నందు కేతువు ఉన్నందువల్ల, ధన స్థానము నందు శుక్ర, శని, కుజులు ఉన్నందువల్ల ధనలాభస్థాన దోషం ఏర్పడటం వల్ల, కుటుంబస్థాన దోషం ఏర్పడటం వల్ల అనంతనాగసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించిన సర్వదా శుభం కలుగుతుంది.
2017 నుండి ఆర్థికంగా నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు. 2013 నవంబర్ నుండి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2018 నుండి 2030 వరకు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ఆదిత్యుని ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగకలదు. నెలకు ఒక శనివారం నాడు 9 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించిన శుభం కలుగుతుంది. దేవాలయాల్లో జువ్వి చెట్టును నాటిన కలసి రాగలదు.